YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

భారత్ అంతర్గత వ్యవహారం...కుండబద్దలు కొట్టిన ఎంపీలు

భారత్ అంతర్గత వ్యవహారం...కుండబద్దలు కొట్టిన ఎంపీలు

భారత్ అంతర్గత వ్యవహారం...కుండబద్దలు కొట్టిన ఎంపీలు
న్యూఢిల్లీ,అక్టోబర్ 30, 
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకోడానికి యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులు రెండు రోజుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీనగర్ చేరుకున్న 23 మంది ఎంపీల బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. బుధవారం పర్యటన ముగిసిన తర్వాత ఈ బృందం మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని స్పష్టం చేశారు. ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.అలాగే, తాము పర్యటనకు వచ్చిన రోజే ఐదుగురు అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫ్రాన్స్‌ ఎంపీ హెన్రిస్ మలోస్సే తెలిపారు. లోయలో శాంతి కోసం ఆర్మీ, పోలీసులు సహా యువకుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన తరువాత కశ్మీర్‌లో పరిస్థితులు మొదటిసారిగా అంచనా వేయడమే లక్ష్యంగా తమ పర్యటన సాగిందని బ్రిటన్‌కు చెందిన ఎంపీ న్యూటన్ డన్ వివరించారు. అనేక ఏళ్ల పోరాటాల తర్వాత ప్రశాంతత నెలకున్న ఐరోపా‌ ప్రాంతానికి చెందిన తాము, భారత్ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతత కలిగిన దేశంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రపంచ ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు బాసటగా నిలుస్తామని న్యూటన్ తెలిపారు. ఈ పర్యటనతో వాస్తవ స్థితిగతలను తెలుసుకున్నామని, తాము చూసినదాన్ని కచ్చితంగా సమర్దిస్తామని వెల్లడించారు.అలాగే, అంతర్జాతీయ మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, కశ్మీర్ పరిస్థితులపై వక్రీకరించింది.. తమ దేశాలకు తిరిగివెళ్లిన తర్వాత ఇక్కడ పరిస్థితులను వివరిస్తామని పోలండ్ ఎంపీ వ్యాఖ్యానించారు. చాలాసార్లు తాను భారతదేశానికి వచ్చానని, ప్రస్తుతం కశ్మీర్‌లోని పరిస్థితుల గురించి మొదటిసారిగా తెలుసుకోవడానికి వచ్చానని ఫ్రాన్స్‌కు చెందిన మరో ఎంపీ థియర్రీ మెరైనీ అన్నారు. తీవ్రవాదులు దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోరని.. ఆఫ్గనిస్థాన్, సిరియాలో ఏం జరిగిందో స్వయంగా చూశానని అన్నారు.

Related Posts