YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ అధికారులపై  మంత్రి సంచలన ఆరోపణలు

ఏసీబీ అధికారులపై  మంత్రి సంచలన ఆరోపణలు

ఏసీబీ అధికారులపై  మంత్రి సంచలన ఆరోపణలు
విజయవాడ, అక్టోబర్ 30, (న్యూస్ పల్స్)
అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏసీబీ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏసీబీ అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారన్నారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని.. అలాంటి అధికారులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. తప్పు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలన్న ఆయన.. విశాఖ రేంజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పారు.కంచె చేను మేసినట్లు ఏసీబీ అధికారుల పనితీరు ఉందన్నారు డిప్యూటీ సీఎం. ‘విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు దారి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఉన్నారు. అవినీతిని అరికట్టవలిసిన వాళ్లు దారుణాలు చేస్తుంటే మరి న్యాయం ఎవరు చేయగలరు. అందుకే సీరియస్‌గా స్పందించాం.. వెంటనే వాళ్లను సస్పెండ్ చేయడమే కాకుండా.. సామాన్యులు తప్పుచేస్తే క్రిమినల్ కేసులు ఎలా ఫైల్ చేస్తున్నారో.. వీళ్లపై కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేసి చర్యలు తీసుకోవాలి. ఏసీబీ డీజీతో మాట్లాడా.. ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం’అన్నారు సుభాష్ చంద్రబోస్.అధికారులు లంచాలు తీసుకోవాలి.. ఏసీబీ వాళ్లకు వాటాలు ఇవ్వాలి అంటూ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. సీఎం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లలేదని.. ఆయనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఆ అధికారులపై విచారణ కూడా అవసరం లేదు.. క్లియర్‌గా ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. మరి ఈ తతంగంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

Related Posts