YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీ తర్వాత కరణమేనా.. ప్రకాశంలో జోరుగా ప్రచారం

వంశీ తర్వాత కరణమేనా.. ప్రకాశంలో జోరుగా ప్రచారం

వంశీ తర్వాత కరణమేనా..
ప్రకాశంలో జోరుగా ప్రచారం
ఒంగోలు, 
వైసీపీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. టీడీపీలో గెలిచిన నాయ‌కులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీతో ప్రారంభ‌మ‌వుతున్న ఈ జంపింగుల ప‌ర్వం ఎటు దారితీస్తుందో.. ఎంత‌మంది టీడీపీని వీడి వైసీపీలో చేరిపోతారో.. అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ప‌లువురు నాయ‌కుల ప‌రిస్థితిపై విశ్లేష‌కులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి కూడా జింపింగ్‌ల బాట‌లో ఉన్నార‌నే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయ‌న వైఖ‌రి కూడా దీనికి బ‌లం చేకూరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోప‌ణ‌లను కానీ, ఆయ‌న పిలుపు ఇస్తున్న మేర‌కు ధ‌ర్నాలు, నిర‌స‌న కార్యక్రమాల్లో పాల్గొన‌డం కానీ చేయ‌డం లేదు.కేవ‌లం త‌న ప‌నేదో తాను చేసుకుని పోతున్నారు. చంద్రబాబు.. ఎప్పటిక‌ప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. అన్నా కేంటీన్ల మూసి వేత స‌మ‌యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చారు. ఆ స‌మ‌యంలో కూడా క‌ర‌ణం బలరాం మౌనం వ‌హించారు. ఇక‌, తాజాగా ఇసుక కొర‌త‌పై చంద్రబాబు పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు క‌దం తొక్కాయి. వీటిలోనూ క‌ర‌ణం ఎక్కడా పార్టిసిపేట్ చేయ‌లేదు. పైగా ఆయ‌న పార్టీ మార‌తార‌నే వార్తలు వెల్లువ‌లా వ‌స్తున్నా కూడా ఖండించడం లేదు. ఇక‌, ఇదిలావుంటే ఇదే జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన మాజీ వైసీపీ నేత గొట్టిపాటి ర‌వి కుమార్ కూడా పార్టీ మార‌తార‌నే ప్రచారం జ‌రుగుతోంది
2014లో ఈయ‌న వైసీపీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత కాలంలో చంద్రబాబుకు చేరువ‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లోనూ అద్దంకి నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న పార్టీలో ఇమ‌డ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో అటు క‌ర‌ణం బలరాం, ఇటు గొట్టిపాటి కూడా పార్టీమార‌తార‌నే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ఇద్దరూ వైసీపీ వంక చూస్తున్నార‌నే మ‌రో ప్రచారం ఉంది. కానీ, వీరిలో క‌ర‌ణం బలరాం కి మాత్రమే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తార‌ని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్లు కూడా క‌ర‌ణం బలరాం కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. గొట్టిపాటి ఎలాగూ వైసీపీ ముద్ర త‌గిలించుకుని టీడీపీలోకి వెళ్లిన నాయ‌కుడే. పైగా ఆయ‌న టీడీపీని వీడితే ఆ పార్టీకి వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు.ఇక జ‌గ‌న్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన అద్దంకి నుంచే గొట్టిపాటి ర‌వికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుబ్బారెడ్డికి ముందు నుంచి ర‌వితో స‌ఖ్యత లేదు. అదే స‌మ‌యంలో క‌ర‌ణం బలరాం వంటి టీడీపీ సీనియ‌ర్‌ను తీసుకుంటే..ఆ పార్టీని మాన‌సికంగా దెబ్బకొట్టవ‌చ్చనే వ్యూహంలో జ‌గ‌న్ ఉన్నార‌ని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా క‌ర‌ణం బలరాం టీడీపీతో అనుబంధం పెంచుకున్నారు. పైగా చంద్రబాబుతోనూ మంచి యాక్సస్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి నాయ‌కుడిని పార్టీలోకి తీసుకుంటే.. బాబుకు మాన‌సికంగా మ‌రోప‌క్క, పార్టీ ప‌రంగా కూడా ఇబ్బందే. ఎలాగూ రాష్ట్రంలో టీడీపీకి గ‌ట్టి దెబ్బకొట్టాల‌ని చూస్తున్న జ‌గ‌న్ గొట్టి పాటి క‌న్నా కూడా క‌ర‌ణం బలరాం రాక‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెబుతున్నారు.అదే టైంలో గొట్టిపాటి పార్టీలో ఉన్నప్పుడు జ‌గ‌న్ ఎంతో ప్రయార్టీ ఇచ్చారు. మంత్రి ప‌ద‌విపై హామీ ఇచ్చారు. చివ‌ర‌కు ఆయ‌న షాక్ ఇవ్వడంతో గొట్టిపాటిని తిరిగి ఎంత మాత్రం పార్టీలో చేర్చుకోకూడ‌ద‌ని అప్పుడే డిసైడ్ అయ్యార‌ట‌. అందుకే అద్దంకిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన సీనియ‌ర్ నేత గ‌ర‌ట‌య్య కుమారుడు బాచిన కృష్ణ చైత‌న్యకు ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు కూడా అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ చైత‌న్య యువ‌కుడు కావ‌డంతో ఆయ‌న అయితేనే అక్కడ ర‌వికి ట‌ఫ్ ఫైట్ ఇస్తార‌ని అధిష్టానం భావిస్తోంది.ఇప్పటికే క‌ర‌ణం బలరాం జిల్లాకు చెందిన మంత్రి బాలినేనితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డితోనూ ట‌చ్‌లో ఉన్నారు. ఆయ‌న‌కు అటు అద్దంకితో పాటు చీరాల‌, ఒంగోలు, ప‌ర్చూరులోనూ ప‌ట్టు ఉంది. దీంతో ఇప్పుడు ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుని ఆయ‌న త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు జ‌డ్పీచైర్మన్ సీటు ఆఫ‌ర్ చేసే ప్రయ‌త్నాల్లో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగూ ద‌గ్గుబాటిని జ‌గ‌న్ పార్టీ నుంచి పొమ్మన‌కుండా పొగ పెట్టే ప్రయ‌త్నాల్లో ఉన్నారు. ఈ టైంలోనే క‌ర‌ణం బలరాం ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకు ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు టాక్‌… మ‌రి క‌ర‌ణం బలరాం డెసిష‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Related Posts