YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మంతనాలు ప్రారంభించిన  ట్రబుల్ షూటర్

మంతనాలు ప్రారంభించిన  ట్రబుల్ షూటర్

మంతనాలు ప్రారంభించిన  ట్రబుల్ షూటర్
బెంగళూర్, 
డీకేశివకుమార్ జైలు నుంచి తిరిగి రావడంతో కాంగ్రెస్ తిరిగి పుంజుకోనుంది. డీకే శివకుమార్ రాకతో ఇటు కాంగ్రెస్ నేతల్లోనూ అటు క్యాడర్ లోనూ ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి. డీకే శివకుమార్ ఇటీవల మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లారు. అయితే ఆయన జైలులో ఉండటంతో ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీ పడిందనే చెప్పాలి. డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు నమ్మకమైన క్యాడర్ ఉండటంతో ఉప ఎన్నికల్లో ప్రభావం చూపుతారని కాంగ్రెస్ నమ్ముతుంది.డిసెంబరు నెలలో కర్ణాటకలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో డీకే శివకుమార్ తిరిగి బయటకు రావడంతో ఆయన ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ సయితం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు పూర్తి బాధ్యతలను అప్పగించే అవకాశముంది. ఇప్పటికే సిద్ధరామయ్యకు ఆ బాధ్యతలను అప్పగించినప్పటికీ డీకే శివకుమార్ రాకతో ఆయనను కూడా అభ్యర్థుల ఎంపికలో భాగస్వామిని చేయలాని నిర్ణయించారు.డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెళ్లి పరామర్శించలేదు. సాక్షాత్తూ పార్టీ అధినేత్రి సోనియా వెళ్లి పలకరించి వచ్చారు. సిద్ధరామయ్యకు శత్రువైన కుమారస్వామి సయితం తీహార్ జైలుకు వెళ్లి డీకేతో మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటు జేడీఎస్ తో కూడా డీకే శివకుమార్ సత్సంబంధాలు నెలకొనడంతో ఆయనను జేడీఎస్ తో మంతనాలు జరిపేందుకు అధిష్టానం పురమాయిస్తుందన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. ఇప్పటికే జేడీఎస్ ఒంటరిగా పదిహేను అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీకే జేడీఎస్ ముఖ్యనేతలతో చర్చలు జరిపే అవకాశముంది. ఓట్లు చీలిపోకుండా జేడీఎస్ తమకు పట్టున్న ప్రాంతాల్లోనే పోటీ చేసేలా డీకే శివకుమార్ జేడీఎస్ నేతలతో రాయబారం జరపాలని భావిస్తున్నారు. పదిహేను స్థానాల్లో ఎక్కువ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే కావడంతో అక్కడ జేడీఎస్ పోటీచేయకుండా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగిస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్యకు, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిల మధ్య మాటల యుద్ధం జరగడంతో డీకే శివకుమార్ ను జేడీఎస్ ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. మరి డీకే శివకుమార్ ఈ విషయంలో సక్సెస్ అవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts