YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి
నగరి, 
భారత  ప్రథమ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నగరి టవర్ క్లాక్ సెంటర్ లో  ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు. అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా వారి సేవలను కొనియాడారు.  రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి గర్వకారణమన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో బి.జే.పి.నాయకుల పాత్ర ఏమాత్రం లేదన్నారు.  భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టారన్నారు.   రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది వారన్నారు.  జవహర్ లాల్ నెహ్రూతర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిలిచారన్నారు. బ్యాంకులను జాతీయం చేసి ప్రతి సామాన్యుడికి సైతం బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీ గారికి దక్కుతుందన్నారు.   తూర్పు పాకిస్తాన్ను  పాకిస్తాన్ నుండి విడదీసిబంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశారన్నారు. 1971 సంవత్సరం భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడ ఇందిరా గాంధీ యేనన్నారు. పేద ప్రజలకు భూములు పంపిణీ చేసిన ఘనత కూడా ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశించి ఉగ్రవాదాన్ని అణచి వేసిన వ్యక్తి ఇందిరాగాంధీ అని తెలిపారు. భారత చరిత్రలో హత్యకు గురైన  మొట్టమొదటి భారతప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ యే అన్నారు.  అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నన్నారు. దేశ ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఘనత ఇందిర కుటుంబానికే దక్కిందన్నారు.

Related Posts