YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంకా పూర్తి కానీ నాట్లు

ఇంకా పూర్తి కానీ నాట్లు

ఇంకా పూర్తి కానీ నాట్లు
గుంటూరు,
నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఏ పంట వేసుకున్నా నీరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ వరినాట్లు పూర్తి కాలేదు. ఇప్పటికీ గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాల్లో నాట్లు వేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. 40 రోజుల క్రితం నుంచి వేస్తున్న వరి వివిధ దశల్లో ఉంది. నీటి ఎద్దడి వల్ల ఇప్పటికే సాగులో ఉన్న పైర్ల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కృష్ణా యాజమాన్య బోర్డు నుంచి నీటి కేటాయింపుల్లోనే ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించింది. గుంటూరు జిల్లాలో 2014-15 సంవత్సరంలో మాగాణి 2.64 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 4.29 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేశారు. ఇందుకు గాను 159.08 టిఎంసీల నీటిని వినియోగించారు. 2015-16లో వర్షాభావం వల్ల వరి సాగు చేయలేదు. ఆరుతడికి కేవలం 17.48 టిఎంసీలు మాత్రమే కేటాయించారు. 2016-17లో కేవలం 43 వేల ఎకరాల్లోనే వరి సాగు చేశారు. ఆరుతడి పంటలు 5.77 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు గాను 58.87 టిఎంసీలు నీరు వినియోగించారు. 2017-18లో 22 వేల ఎకరాల్లో వరి, 6.22 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయగా 89.90 టిఎంసీల నీరు వినియోగించారు. 2018-19లో 2.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని, 4.24 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో తాగు, సాగునీటి అవసరాల కోసం 132 టిఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. కానీ ఈఏడాది 91.87 టిఎంసీలు మాత్రమే కృష్ణా యాజమాన్యబోర్డు కేటాయించింది. శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లు ఈ ఏడాది పూర్తిగా నిండాయి. దీంతో పూర్తి స్థాయిలో నీరు వస్తుందని రైతులు ఆశించారు. ఆదిలో పత్తి, కంది తదితర పంటలు వేసిన రైతులు వాటిని పీకివేసి వరిసాగుకు ఆసక్తి చూపారు. కానీ పంటలువేసిన తరువాత నీరివ్వలేమని కేటాయించిన మేరకు వినియోగించుకోవాలని చెబుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 575 అడుగుల మేరకు నీటి మట్టంలో 271 టిఎంసీలు నీరు ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కేటాయించిన 91 టిఎంసీల్లో ఇప్పటికే తాగు, సాగునీటి అవసరాల కోసం 53 టిఎంసీలు వినియోగించుకున్నామని ఇంకా 38 టిఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాకు 22 టిఎంసీలు, ప్రకాశం జిల్లాకు 16 టిఎంసీలు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. అయితే వేసిన పంటలకు మొత్తంగా గుంటూరు 32, ప్రకాశంకు 26 టిఎంసీలు అవసరం ఉంది. కేటాయించిన నీటిలో అందుబాటులో ఉన్న 38 టిఎంసిలు పోను ఇంకా రెండు జిల్లాలకు కలిపి 20 టిఎంసీలు సాగు నీటి కింద కేటాయించాల్సి ఉంది

Related Posts