Highlights
- ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బాటలో నితీష్
- గతంలోనే ప్రత్యేక హోదా కావాలని డిమాండ్
- బీహార్ సీఎం నితీష్ కుమార్

ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పడం వంటి పరిణామాలతో నితీష్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. బీహార్‌కు ప్రత్యేక హోదా లభిస్తే పరిశ్రమలకు పన్ను మినహాయింపులు దక్కుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నితీష్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనితో త్యేక హోదా డిమాండ్‌ను మరోసారి తెరపైకి తేవాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. గతంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని.. ఆ పోరాటాన్ని ఇప్పుడు మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళతామని ఆయన చెప్పారు. కాగా యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఘోర పరాజయం, బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వి యాదవ్ కూడా బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్‌కు సంబంధించి నితీష్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీతో చేతులు కలపగానే ప్రత్యేక హోదా అంశాన్ని నితీష్ తుంగలో తొక్కారని తేజస్వి యాదవ్ ఆరోపించారు.ఇదిలా ఉండగా.. ఎన్డీయేకు టీడీపీ గుడ్‌బై చెప్పడం వంటి పరిణామాలతో నితీష్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం.