మూడేళ్లు నిద్ర పోయారు
తాడేపల్లి నవంబర్ 01
హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆహ్వా నించదగింది. పోలవరం పనులు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయి. పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు నిర్దేశిత సమయంలో పూర్తి చేచేస్తాం. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పునరావాసం పనులు నిర్లక్ష్యం చేసింది, అందుకే ఆలస్యం అయింది. అన్ని ప్రాజెక్టుల పనులు, పునరావాసం నియమిత సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. అబద్దాలు, మోసం చేసి ప్రజలను మభ్యపెట్టే అలవాటు మాకు లేదు. ప్రతిపక్షoతో పాటు మరో రెండు పార్టీలు ఎదో హడావుడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయంతో రివర్స్ టెండర్ ద్వారా 800 కోట్లు ఆదా చేసి చూపించాం. 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేయగలమని అధికారులు అంచనా వేశారని అన్నారు. ఏ పనులు పూర్తి చేయకుండా 70 శాతం చేశామని ప్రకటించి చంద్రబాబు మోసం చేశారు. మూడేళ్లపాటు నిద్రపోయారు.. చివరి రెండేళ్లలో స్పిల్ వే కట్టి అంతా చేసేసామని గొప్పలు చెప్పారని మంత్రి విమర్శించారు.