YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హోదాపై వైఖరి మారలేదు

హోదాపై వైఖరి మారలేదు

హోదాపై వైఖరి మారలేదు
విశాఖపట్నం నవంబర్ 01
ఏపీ సిఎం జగన్‌ హయాంలో విశాఖకు మహర్దశ పట్టనుందని రాజ్యసభ సభ్యుడు  విజయ సాయిరెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హాయంలో నవ నిర్మాణ దీక్షలు అంటూ హడావుడి చేశారే తప్ప .. ఆంధ్ర రాష్ట్ర అవరణ దినోత్సవాన్ని విస్మరించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ విభాగంలో 68 వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుల గురించి కామర్స్ శాఖకు లేఖ రాస్తే వివరాలు లేవని చెప్పారని తెలిపారు. టీడీపీ హయాంలో విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణ నిష్ఫక్షపాతంగా జరుగుతుందన్నారు. భూ కుంభకోణాల్లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 
హైదరాబాద్ లా ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టే యోచన లేదని..సీఆర్పీసీ, ఐ పి సీ పరిధిలోనే చర్యలు వుంటాయని తెలిపారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు వుండవని వెల్లడించారు. కులాల వారీగా మీడియా విభజన బాధాకరమన్నారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రికి గౌరవం వుందని చెప్పారు. చంద్రబాబు వద్ద పొలిటికల్ కాల్ షీట్లు పవన్ తీసుకున్నారని విమర్శించారు. పవన్‌ మాటలు ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబుకు పప్పు నాయుడు ఓ పుత్రుడు అని..పవన్ కల్యాణ్‌ మరో పుత్రుడని ఎద్దేవా చేశారు. లోకేష్ ఐదేళ్లు ఆహార దీక్ష చేసి.. నిన్న ఐదు గంటలు నిరాహార దీక్ష చేశారని.. దీని వల్ల ఫలితం ఉండదన్నారు. పవన్ ప్రజల సమస్యలు తీర్చుతారని ప్రజలు నమ్మి ఉంటే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్‌ ఉంటుందని.. డివిజన్ రెండూ వుండేలా ప్రధాని మోదీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ వైఖరి మారలేదన్నారు. లూలు సంస్థ విశాఖలో నిర్మాణాలు చేపట్టలేదని.. అందుకే ఒప్పందం రద్దు చేసామని వెల్లడించారు. పోలవరం పై కోర్టు తీర్పు సంతోషకరమని, ప్రాజెక్ట్  త్వరగా పూర్తి కానుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Related Posts