చట్టానికి ఎవరూ అతీతులు కారు
నెల్లూరు నవంబర్ 1
ఆర్థిక నేరాల కేసులో వ్యక్తిగత హాజరుమినహాయింపు కోరుతూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో సీబీఐ కోర్టు ప్రజలందరూ కోరుకున్న తీర్పునిచ్చింది. దేశాధ్యక్షులైనా పంచాయతీ సర్పంచ్ అయినా రాష్ట్రానికి సీఎం అయినా అతిపెద్ద కంపెనీల అధినేతలయినా ఆర్థిక నేరాల కేసులో చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయం స్పష్టం చేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ సమానమనే తీర్పు రావడం అభినందనీయం. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన బృందంలో ఇప్పటికీ మార్పురాలేదు. కోర్టులో సమర్పించిన అఫడవిట్ లో శుక్రవారం కోర్టుకు హాజరైతే రూ.60 లక్షలవుతుందని తప్పుడు సమాచారం ఇచ్చారు..ఇది కూడా నేరమేనని అన్నారు. ఎంతయినా మీరు పెట్టుకోవాల్సిందే..ఏపీ సీఎంగా వచ్చిన కేసు కాదది..పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతమైన కేసు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నా గన్నవరం నుంచి హైదరాబాద్ కు రానూపోనూ రూ.5 లక్షలకు మించదని అన్నారు. ముఖ్యమంత్రిగా కల్పించాల్సిన రక్షణ ఖర్చులు 2, 3 లక్షలకు మించబోవు. ఖర్చు విషయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత జగన్ రాజీనామా చేయాలని చాలా మంది కోరుతున్నారు..కానీ ఇవి పాత రోజులు కాదు. నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రైవేటు బస్సులు జాతీయ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆయన రాజీనామా చేశారు. ఇక ఈ కేసు విషయంలో రాజీనామా అంటారా..జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి పేరును కోర్టులో పిలిస్తే వెళ్లి బోనులో నిలబడటమంటే విలువలకు తిలోదకాలిచ్చినట్టే. ప్రజాప్రతినిధుల కేసుల్లో ఏడాది లోపు తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చింది..కానీ తీర్పు సక్రమంగా అమలు కావడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు కూడా పక్కాగా అమలుకావాలని ఆశిస్తున్నాం..తప్పులు చేసిన వారికి ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని అయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల విషయాల్లోనూ కోర్టులు విచారణ పూర్తి చేసి త్వరగా తేల్చేయాలని కోరుతున్నామని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు..