4న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్?
హైదరాబాద్ నవంబర్ 1 :
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదట కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, తర్వాతి దశలో మిగతావాటికి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ శాఖ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను తీయనుంది.