YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కోమటిరెడ్డి పిటిషన్ పై  విచారణ సోమవారానికి వాయిదా..

Highlights

  • విచారణ చేపట్టిన హైకోర్టు 
  • ప్రతివాదులకు నోటీసులు జారీ
  • ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి హాజరు
కోమటిరెడ్డి పిటిషన్ పై  విచారణ సోమవారానికి వాయిదా..

ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణను చేపట్టింది. తెలంగాణ అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పై మైక్ విసిరిన ఘటనలో సభ్యత్వాన్ని  కోల్పోయిన కోమటిరెడ్డి కోర్టును ఆశ్రయించారు.అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఉప ఎన్నికలు నిర్వహించకుండా ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించాలని హైకోర్టు కోరారు. .గవర్నర్ ప్రసంగం సభా వ్యవహారాల పరిధిలోకి రాదన్న పిటిషనర్ కోర్టు విన్నవించుకున్నారు. దీనిపై వాదనలు చేపట్టిన న్యాయస్థానం ముందు  పిటిషనర్ తరుపు న్యాయవాది తన వాదనలను వినిపించారు.సభ్యత్వం రద్దు చేసిన సభ్యుల వివరణ కూడా తీసుకోలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. రాజకీయ దురుద్దేశంతోనే సభ్యులను సభ్యత్వం రద్దు చేశారన్నారు. కౌంటర్ దాఖలు కు సమయం కోరిన అడ్వొకేట్ జనరల్.. ఎన్ని రోజులు కావాలన్న ధర్మాసనం.. సోమవారం దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు.  దీనితో న్యాయస్థానం తదుపరి విచారణను  సోమవారానికి వాయిదా వేసింది. 

Related Posts