డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్ నవంబర్1
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. నవంబర్ 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేదని తెలిపింది. రూ.500 అపరాధ రుసుముతో నవంబర్ 7 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.