ధర్మ సూక్ష్మాలు
బ్రహ్మము గారు చెప్పినవి జరిగినవి
1)చల్లకంటే కల్లునే గొప్పదిగా భావిస్తారు
2)వావివరుసలు మార్చిపోతారు.
3)వర్ణవ్యవస్థ నాశనమవుతుంది
4)భర్తలను భార్యలు ఏలుతారు
5)రాజరికాలు నశిస్తాయి ,ప్రజలే ప్రభువులవుతారు
6)తిరుపతి పెద్ద పట్టణమవుతుంది
7)ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు
8)చీమకుర్తి,బెజవాడ లు మహా పట్టణాలవుతాయి
9)ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు
10)కాముకత్వము పెరుగుతుంది
11)భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు
12)మాచర్ల రాజులు మాధవతి కారణంగా సమస్తము సమసిపోదురు
13)కోటి విధ్యలున్న కూడులేక మాడిపోతారు
14)సర్వవస్తువులూ కల్తీ అవుతాయి
15)భర్తలను భార్యలూ,భార్యలను భర్తలూ ధనం కోసం వేపుకు తింటారు
16)ముండమోపులు ముత్తైదువులవుతారు
17)నీటిని కొనుగోలుచేస్తారు
18)ఎడ్లూ,దున్నపోతులూ లేకుండా బండ్లు నడుస్తాయి.
19)మానవులు పక్షుల్లా ఎగురుతారు.
ఇక జరగాల్సినవి
1)తిరుపతికి వెళ్లే అన్ని దారులూ మూసుకుపోతాయి
2)వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు
3)క్రిష్ణా నది మధ్యలో బంగారు రధం బయటపడుతుంది.అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు
4)శ్రీశైల మల్లిఖార్జునుడు భక్తులతో మాట్లాడతాడు
5)యాగంటి బసవన్న రంకె వేస్తాడు
6)మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది
7)జనగానపల్లె లో పాతరమీది చింతచెట్టుకు జాజులు పూస్తాయి
8)రాయదుర్గం లో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది
9)శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ .జరుగుతుంది
10)మల్లిఖార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు
11)పెనుగొండలో పెద్ద పులులు
తిరుగుతాయి.
12)నెల్లూరు
సీమ నీటిలో మునిగిపోతుంది.
13)శ్రీకుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు
14)అర్ధరాత్రి సూర్యోదయమవుతుంది.
15)బెంగుళూరులోని వైశ్య వర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుంది
16)కంచి కామాక్షి కనులేర్ర చేస్తుంది.ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారు.