YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మారుతున్న సీఎం సొంత గ్రామం

మారుతున్న సీఎం సొంత గ్రామం

మారుతున్న సీఎం సొంత గ్రామం
మెదక్, నవంబర్ 2,
చింతమడకను బంగారు తునక చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీ అమలుకు మూడు నెలల తర్వాత కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. గతంలో ప్రకటించినట్టుగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా ఉపాధి కల్పించడంతో పాటు డబుల్  బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేసేందుకు ఇప్పటికే 50 కుటుంబాలను ఎంపిక చేశారు. మరోవైపు చింతమడక, అంకంపేట, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాలకు సంబంధించి విలేజ్ ప్రొఫైల్స్ తయారు చేశారు. రెండు నెలల క్రితమే గ్రామస్తుల హెల్త్ ప్రొఫైల్తయారీ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని  నిర్వహించారు.ఈ సందర్భంగా పాత చింతమడక గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న దాదాపు మూడు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా రక్త నమూనాలు సేకరించారు. తెలంగాణ రాష్ట్రానికే  దిక్సూచిలా ఉండేలా గ్రామ హెల్త్ ప్రొఫైల్తయారు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు వీటిని సిద్ధం చేస్తున్నారు. గ్రామ సమగ్రాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు ఇప్పటికే స్థానికులతో సమావేశమై  చర్చించారు. రెండు రోజుల క్రితం చింతమడకతో పాటు  అంకంపేటలో  పర్యటించిన అధికారులు గ్రామ సమగ్రాభివృద్ధికి తీసుకునే చర్యలను వివరించడమే కాకుండా సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.సీఎం కేసీఆర్ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామాలైన  ఎర్రవల్లి, నర్సన్నపేట తరహాలో డబుల్బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. పాత ఇండ్లను కూల్చివేసి అందరికి  డబుల్  బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని తెలియజేసి అందుకు గ్రామస్తుల నుంచి మౌఖిక అంగీకారాన్ని పొందారు. ముందుగా గ్రామంలో పాత ఇండ్లను కూల్చివేసి ఒక పద్ధతి ప్రకారం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతోపాటు పాత, కొత్త చింతమడకలకు వ్యత్యాసం కనిపించేలా లే అవుట్తయారు చేశారు.చింతమడకలో ప్రతి కుటుంబానికి పది లక్షల వరకు ఆర్థిక సహాయం అందించి వారికి ఉపాధి కల్పిస్తానని సీఎం కేసీఆర్ గ్రామ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఉపాధి కోసం సాయం కోరుతూ ఇప్పటికే పలువురు దరఖాస్తులు అందజేశారు. వీటిని పరిశీలించిన అధికారులు మూడు విభాగాలుగా విభజించి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి విడతలో 50 మందిని ఎంపిక చేశారు. రూ. పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఉపాధి కల్పించే విషయంలో మొదట గ్రామంలో నివసించేవారికి అవకాశం కల్పిస్తున్నారు. లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా రూ. పది  లక్షల పరిధిలో వారు దరఖాస్తులో  కోరుకున్న విధంగా  సెంట్రింగ్డబ్బాలు, టాక్సీ కార్లు, హార్వెస్టర్ వంటి మిషన్లను అందజేయనున్నారు. రెండో విడతలో గ్రామంలో ఓటరు కార్డు, ఆధార్కార్డు, రేషన్కార్డులు కలిగి ఉండి ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న  వారికి వారు కోరుకున్న విధంగా ఉపాధి కల్పించనున్నారు. మూడో విడతలో ఉపాధి కోసం గ్రామాన్ని విడిచి వలస వెళ్లినవారికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు

Related Posts