జీవో నెంబర్ 2430ను రద్దు చేయాలి
అనంతపురం నవంబర్ 02
అనంతపురం ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జీవో నెంబర్ 2430 పై పలువురు చర్చించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు హజరయ్యారు. మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచే మీడియాపై ఆంక్షలా. > జీవో నెంబర్ 2430ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి జీవోలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. వార్తలు రాసే జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. 2430జీవోను వెంటనే రద్దు చేయాలి. ఇలాంటి జీవోల వలన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోయే అవకాశం ఉందని అన్నారు.ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి మట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడూ జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు. కొందరు స్వార్థ ప్రయోజనాలకు మీడియాను వాడుకుంటేనే తప్పని అన్నారు. కొందరు పెట్టుబడుదారులు మీడియా రంగంలోకి రావడం వలనే సమస్య వచ్చిందని అయన అన్నారు.