చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు
కడప నవంబర్ 02
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకం. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా. జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిన పై ఉంది. అందుకే మినహాయింపు ఇవ్వమని కోర్టుకు అప్పీల్ చేసుకున్నారని అన్నారు. సీబీఐ కోర్టు చెప్పేది ఫైనల్ నిర్ణయం కాదు, ఇంకా పైకోర్టులు ఉన్నాయి. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు, కాబట్టి కొన్ని రోజులు ఎదురు చూడండి, ఈ విధమైన ఆరోపణలు చేయడం సరి కాదని అన్నారు. ఖాళీగా లేని కుర్చీకోసం చంద్రబాబు ప్రాకులాడుతున్నారు. మా ప్రభుత్వానికి 5 ఏళ్ళు అధికారంలో ఉండమని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ సీటు కాళీ కాదని అన్నారు. ఘోరంగా ఓడిపోయానన్న చింత చంద్రబాబు కు ఏమాత్రం లేకపోగా.. ఆయన్ను ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అతనికతనే సొంత డబ్బా కొట్టుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఆంద్రప్రదేశ్ లో ముగ్గురు మోడీలన్న చంద్రబాబు ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ నాయకుల వద్దకు చేరాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్టులతో బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు పదే పదే చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు అనేక సార్లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబుకు కొన్ని చిల్లర పార్టీ లు మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. ప్రజల మద్దతు లేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో.. ఆయన ఇంటి పక్కనే కృష్ణా నదీ గర్భంలో ఇసుక అక్రమంగా తవ్వారని వంద కోట్లు పెనాల్టీ వేశారు. జగన్ కు, వైఎస్ఆర్ సీపీ పార్టీకి పత్రికా స్వేచ్ఛ మీద, ప్రజాస్వామ్యం పైనా పూర్తి విశ్వాసం ఉందని అయన అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పకుండా వార్తలు రాయచ్చు, కానీ తప్పు చేయకుండా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకోవద్దా. తప్పుడు వార్తలు రాయడానికి.. వారికి ఏ రాజ్యాంగం హక్కు కల్పించిందని ప్రశ్నించారు. చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమాలన్నీ పవన్ కళ్యాణ్ నెత్తిన వేసుకుంటాడు. - ఒక పార్టీ అధ్యక్షుడు దేశ చరిత్రలో రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోవడం మొదటిసారని అయన అన్నారు.