సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు
విజయవాడ, నవంబర్ 2
ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సీబీఐ కోర్టు తీర్పు అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చెయ్యాలనే డిమాండ్ కూడా తెరపైకి తీసుకొచ్చారు. దీనిపైనే మంత్రులు స్పందించారు.. టీడీపీ నేతల ఆరోపణల్ని తిప్పికొట్టారు. టీడీపీ విమర్శలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికాడు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నాడు. 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉంటున్నాడు. ప్రజలు గుర్తించబట్టే అధికారం పీకేసి తరిమికొట్టారు. అయినా నిప్పు-తుప్పు అని రంకెలేస్తున్నాడు’అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.‘ప్రజలు ముఖాన తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా కాలేదు. పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా వీళ్లకు సిగ్గనిపించడం లేదు. పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కాని మరో పదేళ్లయినా ప్రజాభిమానం సంపాదించుకోలేరు స్తున్నాడు’అన్నారు.