YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 పరిశుభ్రత బాధ్యత అందరిది

 పరిశుభ్రత బాధ్యత అందరిది

 పరిశుభ్రత బాధ్యత అందరిది
నాగర్ కర్నూలు నవంబర్ 2  
నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిపైన ఉన్నదని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  కలెక్టర్ ఈ శ్రీధర్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న పరిశుభ్రత స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక భాగంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్యాలయం ఆవరణలో మునిసిపల్ కమిషనర్ మరియు జిల్లా అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని చెత్తా చెదారాన్ని, ముళ్ల పొదలను తొలగించి, శుభ్రం చేశారు. హరితహారం ద్వారా  చెట్లను నాటి కలెక్టర్ కార్యాలయా ప్రాంగణాన్ని పచ్చదనంతో నిండేలా ఒసే సార్ మార్చాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నాకర్ కర్నూలు పట్టణంలోని ప్రజలు, వ్యాపారస్తులు పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారాన్ని వేయకుండా ఉండాలన్నారు. ముఖ్యంగా పాలిథిన్ కవర్లను ప్రజలు, వ్యాపారులు వాడకుండా ఉంటే మంచిదని, వాటిని వాడడం వలన భూమిలో కరిగేందుకు చాలా సంవత్సరాలు పడుతుందన్నారు. చికెన్ దుకాణదారులు వ్యర్థ పదార్థాలను  రోడ్ల పక్కన పడేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి  చర్యలకు పాల్పడితే చికెన్ వ్యాపారస్తులకు జరిమానాను విధించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ  మోహన్ బాబు ఆర్డిఓ హనుమానాయక్ మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Related Posts