తీవ్రవాదాన్ని సహించేది లేదు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నవంబర్ 02,:
తీవ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితిలోనూ సహించేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం అయన దివంగత ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. తరువాత అయన మాట్లాడుతూ 1992 నవంబర్ 29 న హైదరాబాద్ నగరంలో టోలిచౌకి లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తో వెళ్లిన స్ కృష్ణ ప్రసాద్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ కేసులో కొంతమంది ఉగ్రవాదుల కు శిక్ష పడిన ఉరిశిక్ష పడలేదు. ఆ తరువాత వారిని విడుదల చేసారు. కృష్ణ ప్రసాద్ ఒక సాహసోపేతమైన ఐ పి ఎస్ అధికారని అయన కొనియాడారు. దేశంకోసం బలిదానం అయిన పోలీస్ అమరుల కుటుంబాలను గౌరవించుకోవడం మనవిధి. అన్నారు. దేశంలో టెర్రరిజాన్ని సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. అందుకు నరేంద్రమోదీ ఉక్కుపాదం మోపనున్నారు. నో మని ఫర్ టెర్రరిజం అనే కార్యక్రమం కోసం ఈనెల 6,7 తేదీల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నానని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ, అమిషా వచ్చాక తీవ్రవాదనికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అనేక పోలీస్ కుటుంబాలు దేశంకోసం త్యాగాలు చేస్తున్నారని అన్నారు.