YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నకిలీ భూ పత్రాల కేసు….నలుగురు ఆరెస్టు

నకిలీ భూ పత్రాల కేసు….నలుగురు ఆరెస్టు

నకిలీ భూ పత్రాల కేసు….నలుగురు ఆరెస్టు
అమలాపురం నవంబర్ 02,:
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, అమలాపురం మండలం నకిలీ భూ పత్రాలతో అమలాపురం పట్టణం లోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ నుండి 1 కోటి 50 లక్షల రూపాయలు కాజేసి బ్యాంకు వారిని బురిడీ కొట్టించిన కేసులో నలుగురు  ముద్దాయిల ను అరెస్ట్ చేసినట్లు అమలాపురం డిఎస్పి షేక్ మాసుం భాషా తెలిపారు. వివరాల ప్రకారం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వారు అక్టోబర్ నెల 16వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి కేసు లో అనుమానితులను విచారించి నవంబర్ 2 వ తేదీన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఉప్పాలగుప్తం గ్రామానికి చెందిన మోటూరు చిన తాతయ్య నాయుడు, అతని భార్య లక్మి నరసమ్మ లు ఇరువురు నకిలీ భూ పత్రాలు సృష్టించి వాటితో బ్యాంకు వారిని మోసగించి 1 కోటి 50 లక్షల రూపాయలు లోన్ గా తీసుకున్నట్లు విచారణ లో వెల్లడైందని డీ ఎస్పీ తెలిపారు.తప్పుడు టైటిల్ డీడ్ బుక్స్ కావాలని డబ్బు ఆశ చూపి కాట్రేనికోన మండలం లోని కందికుప్ప వి ఆర్ ఓ కే. ఏసురత్నం  మరియు చిర్ర యానాం వి ఆర్ ఓ జి.విష్ణుమూర్తి లను సంప్రదించి 1B రిజిస్టర్ అడంగల్ ను పరిశీలించకుండా తప్పుడు సర్వే నెంబర్లతో తాహసీల్దార్ కు రిపోర్ట్ ఇచ్చి ఆన్ లైన్ లో వెబ్ పోర్టల్ నందు నమోదు చేయించారు.అదే విధంగా 2018 సంవత్సరంలో తాతయ్య నాయుడు కు పరిచయమైన కామనగారువు వి ఆర్ ఓ ప్రశాంత్ కుమార్ కు డబ్బు ఆశ చూపి భూమి లేకున్నా ఉన్నట్లు తప్పుడు రికార్డు సృష్టించి బ్యాంకును మోసగించారని డి ఎస్పీ  అన్నారు.ఈ కేసు కు సంభందించి ప్రధాన ముద్దాయి అయిన మోటురి చిన తాతయ్య నాయుడు,భార్య లక్ష్మి నరసమ్మ పరారీలో ఉన్నారు అని తెలిపారు.అలాగే ఈ కేసులో మిగిలిన రెవెన్యూ మరియు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అధికారుల పాత్ర పై విచారణ కొనసాగుతున్నది అని డి ఎస్పీ తెలిపారు.

Related Posts