ఆ పోలీసుపై తొమ్మిది కేసులున్నాయి
అనంతపురం నవంబర్ 02,:
అనంతపురం జిల్లాలో తీవ్ర సంచనలం సృష్టించిన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంపై ఉన్నతాధికారులు స్పందించారు. అధికారుల వేదింపులకు తాళలేక జిల్లా కలెక్టర్ వాహనం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ప్రకాష్ గతంలో చాలా అరాచకాలు చేశారని, అతని పైన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని డిఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు. ప్రకాశ్ పై 9 కేసులు ఉన్నాయని చెప్పారు. ఇదే కాకుండా నేరాలు చెయ్యడం ప్రవృత్తిగా మార్చుకున్నారని చెప్పారు. గతంలో ఓ కేసులో రెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా పడిందని, ద్విచక్ర వాహనాల చోరీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.