YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లాంగ్ మర్చ్ కాదు..రాంగ్ మార్చ్

లాంగ్ మర్చ్ కాదు..రాంగ్ మార్చ్

లాంగ్ మర్చ్ కాదు..రాంగ్ మార్చ్
అమరావతి నవంబర్ 02,:
రాష్ట్రంలో ఇసుక విషయంలో ఎటువంటి లొసుగులు లేవు.  లాంగ్ మార్చ్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మద్య ముసుగు తొలగిపోయింది.   చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  తెరవెనుక జరుగుతున్న ఒప్పందాలు దీనితో బయటపడుతున్నాయి.   సిఎం  వైఎస్ జగన్ పై బురదచల్లేందుకు కుట్రలు చేస్తున్నారు.  కొడుకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ను తెర మీదికి తీసుకు వచ్చాడు.   లాంగ్ మార్చ్ కోసం పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎంత ముట్టచెప్పారో స్పష్టం చేయాలి.  గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకుని గాజువాక, భీమవరంలో ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా...?  కృష్ణానది పక్కన వున్న విజయవాడ, గోదావరి పక్కన వున్న రాజమండ్రి, వంశధార పక్కన వున్న శ్రీకాకుళంలో పవన్ లాంగ్ మార్చ్ పెట్టగలరా...?  ఇది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్ అని అయన అన్నారు.  కృష్ణా, గోదావరితో పాటు అన్ని నదుల్లో వరద కొనసాగుతున్న విషయం ప్రజలకు తెలుసు.  ఇటువంటి పరిస్థితుల్లో ఇసుకను తవ్వి తీయడం సాధ్యం కాదు.  దీనికి పక్కదోవ పట్టిస్తూ... ఇసుక వివాదం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలను కూడా ఇసుక కోసం అంటూ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు.  సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుది.   ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు.  ఇప్పటి వరకు దత్తపుత్రుడుగా వున్న పవన్ కళ్యాణ్.. ఈ లాంగ్ మార్చ్ డ్రామాతో పచ్చపుత్రుడుగా మారిపోయాడు.  రాష్ట్రంలో వర్షాల వల్ల వ్యవసాయంకు మేలు జరుగుతోంది.  రైతులు, వ్యవసాయ కూలీలు సంతోషంగా వున్నారు.   పదేళ్లలో పడని వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి.   దవళేశ్వరం వద్ద గోదావరి బ్రహ్మాండంగా పారుతోంది.  ఇంత వరద వుందని తెలిసి కూడా లాంగ్ మార్చి పెట్టారంటే... చంద్రబాబు నుంచి పవన్ ఎంత అందుకున్నాడో స్పష్టం చేయాలని అన్నారు.  రైతులు పల్లెల్లో సంతోషంగా వున్నారు.  అయిదేళ్లలో చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు లాంగ్ మార్చ్ చేయలేదు?  రాష్ట్రంలో వర్షాలు పడటం చంద్రబాబుకు, పవన్ కు ఇష్టం లేదు.  నదులు ప్రవాహంతో వుండటం ఇష్టం లేదు.  రైతులకు సాగునీటి కష్టాలు తీరడం ఇష్టం లేదు.  రైతులు, వ్యవసాయ కూలీలు కష్టంలో వుంటే బాధపడే వారం మేము.   కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు మాత్రం రైతులు సంతోషంగా వుండటం ఇష్టం లేదు.  ఏదో ఒకరకంగా  వైఎస్ జగన్ పై బురద చల్లేందుకు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు.   గుంటూరులో ఇసుక స్టాక్ పాయింట్ చూడటానికి పవన్ కళ్యాణ్ వెళ్లాడు.  గత అయిదేళ్లలో చంద్రబాబు ఇంటి పక్కన కొట్లాది రూపాయల ఇసుక దోపిడీ జరిగిన ప్రదేశాన్ని ఎప్పుడైనా పవన్ చూశారా...?  అందుకు చంద్రబాబు నుంచి పవన్ కు అందిన ప్యాకేజీ ఎంత?  చంద్రబాబు ఇసుక దందాపై గ్రీన్ ట్రిబ్యునల్ వందకోట్లు జరిమానా విధించింది.   దీనిపై ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మాట్లాడారా.. ప్రశ్నించారా...?  శవ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయడం మాకు చేతకాదని అయన అన్నారు.  ప్రజల కష్టాలను రాజకీయ పండుగలా చేసుకునేందుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.   నిజ జీవితంలో లాంగ్ మార్చ్ అనే పదం పవన్ కళ్యాణ్ కు సరిపోదు.  సరైన కారణం లేకుండా లాంగ్ మార్చ్ అంటూ నాటకాలు ఆడవద్దని సూచించారు

Related Posts