యానిమేటర్ ఆత్మహత్యాయత్నం
కాకినాడ నవంబర్ 02,:
తూర్పుగోదావరి జిల్లాలో యానిమేటర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దొంగతనం చేయకపోయినా, చేశాననే నెపంతో వేధిస్తున్నారని మనస్తాపం చెందిన యానిమేటర్ గవరసాని కోటేశ్వరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆమె భర్త ప్రసాద్ చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రాంతీయ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోటేశ్వరి ప్రమేయంతోనే తనను తొలగించారని భావించి, ఆమె బంగారు ఆభరణాలు చోరీ చేసిందంటూ రాణి గత నెల 21న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దాపురం ఎస్సై సురేష్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కోటేశ్వరి, ఆమె భర్తను వాహనాలను తీసుకుని, చోరీ చేసిన బంగారం ఇస్తేనే, వాటిని ఇస్తామన్నారు. ఆ క్రమంలో పోలీసుల స్టేషన్‌కు వెళ్లి తాను దొంగతనం చేయలేదని, వాహనాలు ఇప్పించమని కోటేశ్వరి కోరారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది పోలీస్‌స్టేషన్ బయట పురపాలక సంఘ సెంటర్‌లో ఎలుకల మందును తాగారు. దీనిపై పెద్దాపురం ఎస్సై వి.సురేష్‌ను వివరణ అడగ్గా కోటేశ్వరిపై ఆమె తోడికోడలు గవరసాని ఎస్తేరు రాణి బంగారం దొంగించినట్లు ఫిర్యాదు చేశారన్నారు. బంగారం ఇచ్చేస్తే బాగుటుందని చెప్పాను తప్ప ఆమెను వేధించలేదన్నారు. ఆమె ఎలుకల మందు తాగారన్న విషయం తనకు తెలియదన్నారు.