బండి సంజయ్ దాడికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలి
రాష్ట్ర అద్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్
హైదరాబాద్ నవంబర్ 2
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పైన పోలీసులు అనుచితంగా ప్రవర్తించడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖందించింది. పార్లమెంట్ సభ్యుల పైన దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తించడం ఇకనైనా మానుకోవాలని హితవి పలికింది.శాంతియుతంగా అంతిమయాత్ర జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోనే జరిగినట్టుగా భావిస్తున్నాం. ఆర్టీసీ సమ్మెను అడ్డుకోడానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నదని పార్టీ రాష్ట్ర అద్యక్షులు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.శాంతియుతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, రాజకీయ పార్టీలకు, కార్మికులకు నిరసన తెలియ జేసే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు.గతంలో బీజేపీ శాసనసభా పక్ష నాయకులు శ్రీ రాజా సింగ్ పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న నా (డాక్టర్ కె.లక్ష్మణ్) పైన ఇప్పుడు బిజెపి పార్లమెంటు సభ్యులుగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై పోలీసులు దాడి చేయడం చూస్తుంటే శ్రీ చంద్రశేఖర రావు గారి ప్రభుత్వం పోలీసుల చేత బిజెపి నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. భారతీయ జనతాపార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి దాడులు చేసిన ప్రజల పక్షాన నిలబడి పోరాటం ఉద్యమాలను తీవ్రతరం చేస్తామ,అని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో నిజాం మనస్తత్వాన్ని అలవర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పి సంబంధిత పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేసారు.