కేంద్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ వాతావరణం నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత సంకేతాలందడంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 522 పాయింట్లు పతనమై 33163 స్థాయికి పడిపోగా నిఫ్టీ సైతం 165 పాయింట్లు క్షీణించి 10,195 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే కొనసాగుతుండగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ షేర్లు మాత్రం అతి స్వల్పంగా లాభపడుతున్నాయి.