కోటి సోమవారము
కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ నెల 04.11.19 కోటి సోమవారము అయినది. ఈ సంవత్సరము మొదటి కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావటం చాలా విశేషము.
ఆ రోజు ఉదయం ఉపవాసముండి. ఉదయం శివాలయమునకు వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలమందు గృహము యందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకొని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు .