ఇసుక వారోత్సవాలతో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం
విజయవాడ,
మొత్తానికి జగన్ కి తత్వం బోధపడినట్లుంది. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదన్న సత్యాన్ని అయిదు నెలల పాలనలో గ్రహించారు. పార్టీ అధినేతగా క్యాడర్ కి ఎప్పటికపుడు టార్గెట్లు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక పదవుల్లో ఉన్న వారు సైతం అన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటారని ఉదాశీనంగా ఉన్నారు. దాంతో పాలన గాడిలో పెట్టడంలో నిమగ్నమై ఉన్న జగన్ కి అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అచేతనత్వం బోధపడేసరికి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ పెద్ద పులిగా మారిపోయింది. రెండు చోట్లా తాను ఓడి పార్టీ మొత్తం కొట్టుకుపోయిన పవన్ కళ్యాణ్ కి మళ్ళీ గర్జిస్తున్నాడంటే పార్టీ, ప్రభుత్వం ఎంతటి లోపు ఇచ్చేశాయో జగన్ కి బాగానే అర్ధమైనట్లుగా ఉంది. దాంతో జగన్ ఒకేదెబ్బకు పతిపక్షాలతో పాటు, ఇటు పార్టీ, అటు ప్రభుత్వం దుమ్ముదులపాలనుకుంటున్నారు.ఇసుక వారోత్సవాలు అని జగన్ ఆర్భాటంగా ప్రకటించిన కార్యక్రమం అసలైన పరమార్ధం సొంత పార్టీని రీఛార్జ్ చేయడమే. అదే విధంగా నిస్తేజంగా ఉన్న ప్రభుత్వానికి కొత్త ఊపు తీసుకురావడం కోసం. ఇక అధికారులు సైతం యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా ఉన్నారు. వారిని సైతం కదం తొక్కించాలని. బహుళార్ధ సాధక పధకంగా జగన్ దీన్ని ఎంతో ఆలొచించి ప్రకటించారు. అయితే జగన్ ఇసుక వారోత్సవాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో పార్టీ నాయకులు ఏ మేరకు పాలుపంచుకుంటారో చూడాల్సిఉంది. ఎందుకంటే వారి బాధ వేరుగా ఉంది. ఇది తమ ప్రభుత్వమేనా అన్న బాధతో వారు ఉన్నారు. ప్రభుత్వంలో తమకు ఎక్కడా భాగస్వామ్యం లేదని క్యాడర్, పదవులు రాని లీడర్లు నిరాశ పడుతూంటే పదవులు పొందిన వారు కూడా తమ చేతులు కట్టేసినట్లుగా ఉందని వాపోతున్నారు. పేరుకు తాము మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నాం కానీ అసలైన అధికారం తమకు ఎక్కడిదన్న ఆవేదన వారిదిఅయితే జగన్ వైపు నుంచి చూసుకున్నపుడు ఇది ఒక పరీక్షగా పెట్టారని అంటున్నారు. తాను ఇంతవరకూ పార్టీని సరిగ్గా పట్టించుకోలేదని, నాయకులతో సాన్నిహిత్యం నెరపలేదన్నది ముఖ్యమంత్రికి గ్రహింపు ఉంది. అయితే అదే సమయంలో పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడంలేదన్నది కూడా ఆయనకు సరైన సమాచారం కావల్సివుందని అంటున్నారు. ముఖం ఎదుట మంచి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే నేతలకు చెక్ పెట్టాలని కూడా జగన్ వారోత్సవాల పేరిట ఒక టాస్క్ ఇచ్చారు. ఇపుడు చురుకుగా పార్టీ కోసం పాటుపడేవారిని గుర్తుపెట్టుకుని అందలం ఎక్కించాలన్న అజెండా కూడా ఉందని అంటున్నారు.అదే సమయంలో అవకాశాలు ఇచ్చినా సరిగా బాధ్యతలు నిర్వర్తించని వారికి కూడా గట్టి ఝలక్ ఇవ్వాలని కూడా భావిస్తున్నారుట. అందుకే ఈ ఇసుక వారోత్సవాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పాటీ నాయకులు అంతా ఒక్కత్రాటిపైన నిలబడి జనంలోకి పోవాలని జగన్ కోరుతున్నారు. మరి ఇపుడిపుడే నేతలు దీన్ని అర్ధం చేసుకుని బయటకు వస్తున్నారు. ప్రభుత్వ పక్షాన ఇసుక సమస్య గురించి జనంలో చెప్పి ఒప్పించిన వారే జగన్ దృష్టిలో అసలైన మొనగాళ్ళు, వారే పార్టీకి మౌత్ పీసులుగా గట్టి ప్రతినిధులుగా జగన్ గుర్తిస్తారని అంటున్నారు. మొత్తానికి ఇసుక వారొత్సవాలు విపక్షాల దుమ్ము దులపడానికి మాత్రమే కాదు, సొంత పార్టీ మొద్దు నిద్దర వదలగొట్టడానికి కూడా జగన్ తీసిన ఆయుధంగా చెబుతున్నారువైపే