YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

లక్నో వైపే..బెహాన్ జీ చూపు

లక్నో వైపే..బెహాన్ జీ చూపు

లక్నో వైపే..బెహాన్ జీ చూపు
లక్నో, 
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి టైం బాగాలేనట్లుంది. వరస ఓటములతో మాయావతి పార్టీ నేతలకు సయితం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి రాష్ట్రంలో పోటీకి దిగుతోంది. కర్ణాటక, రాజస్థాన్,మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసి కొన్ని స్థానాల్లో గెలుచుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఆ పార్టీ శాసనసభ్యులు కీలకంగా కూడా మారారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో తన సొంత రాష్ట్రంలోనూ మాయావతి సత్తా చూపించలేకపోయారు.వరస ఓటములతో…..పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన మాయావతి ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఫలితాల తర్వాత పొత్తు లేదంటూ ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ మాయావతి పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మొత్తం 11 స్థానాలకు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే బీజేపీ దాని మిత్రపక్షమైన అప్నాదళ్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాలను సాధించుకుంది. మాయావతి తన సిట్టింగ్ స్థానాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.ఇక హర్యానా రాష్ట్రంలో కూడా బీఎస్పీ పోటీ చేసింది. అక్కడ కూడా బీఎస్పీ ఒక్క స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది. నిజానికి మాయావతి హర్యానా ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా శాసించే స్థానాలను సంపాదించుకుంటామని భావించారు. కానీ మాయావతికి ఫలితాలను చూసిన తర్వాత కానీ పరిస్థితి అర్థం కాలేదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళుతున్నారు. రాజస్థాన్ లో బీఎస్పీ ని ఏకంగా విలీనం చేసేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ గెలిచిన ఆరుగురు బీఎస్పీ అభ్యర్థులు జంప్ చేశారు.దీంతో మాయావతి కాంగ్రెస్ పై గరంగరంగా ఉన్నారు. హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేసిన కుట్ర వల్లనే తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు చేయడం వల్లనే తమకు ఒక్క సీటు కూడా దక్కకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల హర్యానా ప్రజలు ఆగ్రహంతో ఉన్నప్పటికీ కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో తమకు రావాల్సిన ఓట్లు రాకుండా పోయాయని మాయావతి ఆవేదన చెందారు. మొత్తం మీద మాయావతికి వరస ఓటములు ఇబ్బంది పెడుతున్నాయి. మాయావతి ధ్యాసంతా ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది

Related Posts