Highlights
- శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చిన ప్రధాని

శాస్త్రసాంకేతిక రంగంలో ముందు వరుసలో ఉన్న దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. శుక్రవారం మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ల్యాబ్‌ల నుంచి ల్యాండ్‌లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆ పరిశోధనల ఫలాలు ప్రజలకు మరింత చేరువైనప్పుడే సత్ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డారు. ఆవిష్కరణలు చేయడంలో, శాస్త్రసాంకేతికను ఉపయోగించడంలో భారత్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందని మోదీ గుర్తు చేశారు.