బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నవంబర్ 4,
గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం తీసుకు వచ్చిన ఎస్ అర్ డి పి ఫలాలు నగర వాసులకు ఒక్కటోక్కటి గా అందుతున్నాయి. సోమవారం నాడు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీ ఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసి అధికారులు హజరయ్యారు. ఎస్ అర్ డి పి లో భాగం గా 69.47 కోట్ల రూపాయల వ్యయం తో 900 మీటర్ల పొడవున మూడు లేన్లుగా జీహెచ్ఎంసి నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ తాజాగా అందుబాటు లోకి వచ్చింది.నగరం లో ఇప్పటికే 3 ఫ్లై ఓవర్లు , 4 అండర్ పాసులు అందుబాటు లోకి రావడం తో ఆ రూట్ లో ట్రాఫిక్ కష్టాలు తగ్గినట్లే. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ తో మోహిదీపపట్నం, ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా వెళ్ళవచ్చు. ఈ ఫ్లైఓవర్ మెహిదీపట్నం నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసిరావడంతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.