పవన్ కళ్యాణ్ మేకప్ తీస్తే జీరో
తాడేపల్లి నవంబర్ 4,
ఏపిలో ఇసుక కొరత కొంత అధికంగా ఉన్నమాట వాస్తవం. నదులవరదలతోనే ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకలో దోపిడీని అరికట్టి నెలరోజులవ్యవధితీసుకుని మంచి పాలసి తీసుకువద్దామని భావించారు. లాస్ట్ 24 ఇయర్స్ లో ఇంత ఫ్లడ్ ఎప్పుడూ రాలేదని మాజి శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. -భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణాలలో 90 శాతం వాటా చంద్రబాబు,పవన్ కల్యాణ్ లదే ఉంది. గత పదిసంవత్సరాల పూర్వం వరదలు వచ్చినప్పుడు సహజంగా పనులు దొరకవు.ఎందుకు దొరకవంటే ఒక్కో సీజన్ లో వారికి అలా ఉంటుంది. ఆ ఇబ్బందులను ప్లాన్ చేసుకుని ప్రభుత్వసహకారంతోగాని,వారి వెల్ విషర్స్తో గాని అధిగమిస్తారు. చంద్రబాబు,ప వన్ కల్యాణ్ హడావుడి వల్ల భవన నిర్మాణకార్మికులు నైరాశ్యంలో పడిపోయారని అయన అన్నారు. -మనల్ని ఎవరూ పట్టించుకోరనే పరిస్దితిని వారు కల్పించారు. వివిధ రంగాలలో కార్మికులకు ఆయా సీజన్లలో కొంత ఇబ్బంది ఉంటుంది. నిన్న పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పెట్టారు. చంద్రబాబు హయాంలో భవన నిర్మాణకార్మికుల నిధులను డైవర్ట్ చేశారు.అప్పటి కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడును పక్కనపెట్టుకుని అసంభధ్దమైన డిమాండ్లు పెట్టారు. -పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పరిష్కారమార్గాలు చూయించలేదు.కార్మికుల సమస్యపై చిత్తశుద్ది లేదనేలా నిన్న వ్యవహరించారు. బొత్స గురించి,విజయసాయిరెడ్డి గురించి విమర్శలు చేశారు.ఆఫ్ ది రికార్డ్ ఎవరు మాట్లాడినా అది ఓపెన్ డయాస్ లో చెప్పరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్స మంచిమెజారిటీతో గెలిచారు. పవన్ కల్యాణ్ , తనను విజయసాయిరెడ్డి పోల్చుకోవడం సరికాదు. విజయసాయిరెడ్డి భారతదేశంలో పేరెన్నికగన్న ఆడిటర్.పవిత్రమైన ప్రొఫెషన్ లో ఉన్నారు. ఆయనను అనామకుడుకింద మాట్లాడటం ,జైలుకెళ్లి వచ్చిన వ్యక్తిగా మాట్లాడటం దుర్మార్గం. సినిమాలలో ఎంతో వదులుకుని వచ్చానంటావు.ఏంటి నీవు వదులుకోని వచ్చింది. నీవు ముఖానికి మేకప్ రాసుకుంటే హిరో. మేకప్ తీసేస్తే జీరో. ఏమి త్యాగం చేసుకుని వచ్చావు చెప్పని నిలదీసారు. పవన్ కల్యాణ్ మీ చేతగాని ప్రాతివత్యాన్ని ప్పిపుచ్చుకునేందుకు ఇలా విమర్శలు చేయద్దు. నీ గెలుపుకోసం భీమవరంలో సూర్యారావు అనే వ్యక్తి డబ్బు పంచారా లేదా నీవు ఏ సినిమా తీసినా ఆదాయపన్ను లెక్కల్లో చూపించావా పెద్ద హీరోలందరూ రిలీజ్ అయిన తొలిరోజులలో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకోలేదా. విజయసాయిరెడ్డి, జగన్ జైలుకు వెళ్లివచ్చారని మాట్లాడతావా. ఈ రోజులలో రాజకీయాలలో ఉండేవారు ఏ పరిస్దితులలో జైలుకు వెళ్లివచ్చారో తెలుసా నని అన్నారు.అమిత్ షాను నాటి కేంద్రహోంమంత్రి చిదంబరం జైలు లో పెడితే నేడు కేంద్రహోంమంత్రిగా ఉన్న అమిత్ షా చిదంబరాన్ని జైలులో పెట్టారు. 50 దేశాలలో అక్రమ సంపాదన ఉందని చిదంబరంపై కోర్టులలో నివేదికలు సమర్పించారు. అదే చిదంబరం కేంద్ర హోంమంత్రిగా జగన్, విజయసాయిరెడ్డి లపై చిన్నఅభియోగాలతో కేసులు పెట్టారు. అదే నిజంగా కేసు అయితే 700కోట్ల నష్టాలలో ఉన్న హెరిటేజ్ సరిగ్గా సంవత్సరానికి 2,500కోట్లు లాభాలలోకి అదీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే ఎలా సాధ్యం. ప్రజలవద్దకు ఎవరు రమ్మంటే వచ్చావు.త్యాగాలు చేశావంటావు.పవన్ కల్యాణ్ చెప్పే నీతివంతమైన రాజకీయం శుధ్దఅబద్దం.ఇది పవన్ కల్యాణ్ వద్ద ఉన్న వ్యక్తులుచెప్పిన మాట. ఒక ఉన్నతమైన స్దానంలో ఉన్న వ్యక్తి బాస్ నేను మీ పార్టీలోకి వస్తానంటే ఎంపీగా టిక్కెట్టు ఇచ్చి అతనికి ప్రచారానికి వెళ్లవా,అతనికి ఓటు వేయమని చెప్పవా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలనుంచి తప్పుకున్నారు.ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పగలరానీవు నిజంగా బలపడి ఓ స్దానంలోకి వస్తే మంచిదే. ప్రజాస్వామ్యంలో అందరికి మంచిది. జనసేన లాంగ్ మార్చ్ కు భవననిర్మాణ కార్మికులు కొద్దిమంది వచ్చారు. అభిమానులు కూడా బాగా వచ్చారు. రెండోసారి నాదెండ్ల మనోహర్ మాట్లాడతాడని శివశంకర్ అనే అధ్యక్షత వహించిన వ్యక్తి ప్రకటించగానే పవన్ అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. నాదెండ్ల మనోహర్ లింగమనేనికి బంధువు.లింగమనేని చంద్రబాబుకు బంధువు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్గం చొరబడి జనసేనను నాశనం చేస్తున్నారని అంటున్నారు.అలాంటి నాదెండ్ల మనోహర్ స్క్రిప్ట్ రాసిస్తే రాష్ర్టంలో ఏ సమస్యా లేనట్లు లింగమనేని స్దలంలో నిర్మించిన ప్రజావేదికను ప్రస్తావిస్తావా. అంటే ఏంటి అది ఉంచాలా ఎందుకు ఉంచాలి.అక్రమ సామ్రాజ్యాలు చంద్రబాబువి అనేకం ఉన్నాయి.అవి కూల్చాల్సిందే. అభిమానుల బాధ ఏంటంటే...అప్పుడు ప్రజారాజ్యం పార్టీని తెలుగుదేశం వాళ్లే నాశనంచేశారు. ఇప్పుడు జనసేనను కూడా టిడిపివాళ్లే నాశనం చేస్తున్నారు. నాగావళి ఇసుకను అచ్చెన్నాయుడు దోచుకున్నాడా లేదా ఇసుక సమస్య ఉన్నమాట ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు.13 జిల్లాల్లో ఇసుకకు సంబంధించి లెక్కలున్నాయా. టిడిపి నేతల ఇసుక దోపిడీ గురించి ఎప్పుడైనా ప్రశ్నించావా అని అడిగారు. నీవు చెప్పిన డెడ్ లైన్ మాకు సంబంధం లేదు. ప్రతి వినియోగదారుడుకు కూడా ఇసుక అందిస్తాం. పవన్ కల్యాణ్ సినీహిరో అయితే జగన్ రియల్ హీరో. నీ చేత చెప్పించుకోవాల్సిన స్దితిలో మా పార్టీ లేదు. వైయస్ జగన్ ను చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలి.ఆత్మపరిశీలన చేసుకోండని సూచించారు.