విద్యార్ధిని ఆత్మహత్య…తోటి విద్యార్ధుల అందోళన
హైదరాబాద్ నవంబర్ 04
రాచకొండ పోలీసు పరిధిలోని మీర్ పేట్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఫైనలియర్ చదువతున్న సంధ్య సూసైడ్ చేసుకుంది. దీంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సంధ్య ఆత్మహత్యకు లెక్చరెర్ స్వాతి వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మీర్ పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లెక్చరెర్ స్వాతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. డిటెయిండ్ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు.