YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 మాట మరిచారా..? (కృష్ణాజిల్లా)

 మాట మరిచారా..? (కృష్ణాజిల్లా)

 మాట మరిచారా..? (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, నవంబర్ 04(న్యూస్ పల్స్): కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలో 30 పడకల ఆసుపత్రి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుమారు రూ. 3.68 కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించింది. 2017 ఏప్రిల్‌ 22న శంకుస్థాపన చేయగా, నిర్మాణం అనంతరం 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. నేటి వరకు వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల ప్రజలకు సాధారణ వైద్యం కూడా అందకపోవడంతో ఇక్కట్ల పాలవుతున్నారు. కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో అత్యవసర వైద్యం కోసం మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులకు అన్నిరకాలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ కాన్పులు మాత్రమే చేస్తున్నారు. స్కానింగ్‌లు వంటివి చేయాలన్నా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రెవేటు ఆసుపత్రికి వెళ్లాల్సిందే. 30 పడకల ఆసుపత్రి వస్తే స్కానింగ్, అపరేషన్‌ థియేటర్, అధునాతన పడకలు, ఐసీయూ వంటివి అందుబాటులోకి వస్తాయి. గర్భిణులను ఇతర ఆసుపత్రులకు తీసుకువెళ్లకుండా ఇక్కడే అన్నిరకాల వైద్య సేవలు అందించవచ్చు.
చినపాండ్రాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం రెండు మండలాల ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందిస్తోంది. ఇక్కడ రోజూ సుమారు 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. సాధారణ కాన్పులు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. కాన్పు కష్టమనిపిస్తే జిల్లా ఆసుపత్రికి పంపేస్తున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత వైద్యులు అందుబాటులో ఉండరు. కేవలం స్టాప్‌ నర్స్, ఏఎన్‌ఎంలు మాత్రమే ఉంటారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయడం తప్ప పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగిని అప్పటికప్పుడు మచిలీపట్నం, విజయవాడ వంటి ఆసుపత్రులకు తీసుకువెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.  ప్రస్తుతం ఉన్న 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సెంట్రల్‌ ల్యాబ్‌గా మార్చాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. రెండు మండలాల్లోని పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారికి ఈ ల్యాబ్‌ ద్వారా అన్ని రకాల రక్త, తదితర పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. 
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కేవలం ప్రాధమిక చికిత్స మాత్రమే చేస్తున్నారు. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే వైద్యం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తి వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం బీపీ, యూరిన్, సుగర్‌ వంటి సాధారణ పరీక్షలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే అల్ట్రా స్కానింగ్, అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. 

Related Posts