ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ బదిలీ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది.ఈ విషయం సీఎం జగన్‌కు తెలియకుండానే ఎల్వీ.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌కు నిన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కేబినెట్ అజెండాలో పెట్టే అంశాలను సీఎస్ ఆమోదం లేకుండా నేరుగా ఎజెండాలో చేర్చడం ఏపీ బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, విధివిధానాలు పాటించలేదని.. పైగా సీఎస్ ఆమోదం లేకుండా ఎలా చేస్తారని ఎల్వీ ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.. ఈ వ్యవహారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.