YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 జనాభా గణనలో బీసీ కులాల వారీ కాలమ్స్ ఏర్పాటు చేయాలి        ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

Highlights

 జనాభా గణనలో బీసీ కులాల వారీ కాలమ్స్ ఏర్పాటు చేయాలి 
      ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
హైదరాబాద్ నవంబర్ 04,(:
2020 సంవత్సరం లో దేశ జనాభా లెక్కలు గణనకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకు నమూనా పత్రాలు తయారు చేస్తున్నారు. కానీ ఈ నమూనా పత్రాలలో బీసీ కులాల జనాభా వివరాలు సేకరణకు సంబంధించి  కాలమ్స్ లేవు. ఈ జనాభా గణనలో బీసీ కులాల వారీ లెక్కలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి నెలలో జరిగిన కోర్ కమిటీ ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. కావున జనాభా గణనలో బి.సి కులాల లెక్కలు సేకరించే విధంగా ఆదేశాలు జారి చేయాలనీ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు.కానీ ఇటీవల కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల కాలమ్స్ వివరాలు  ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల బీసీ కులాల వివరాలకు సంబంధించిన పెట్టలేదు. కావున తమరు జోక్యం చేసుకొని జనాభా లెక్కల కాలమ్స్ లో బీసీ కులాల వారి లెక్కలకు సంబంధించి ప్రత్యేక కాలమ్స్ ప్రవేశపెట్టాలని కోరారు.బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసి న ఆవశ్యకత ఉంది కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విధ్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు - ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు, రిజర్వేషన్లు అమలు జరుపుతున్నారు. బడ్జెట్టు కేటాయిస్తున్నారు. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు - పంచాయితీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం పడుతున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలని విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక న్యాయపరమైన చట్టపరమైన కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చట్ట సభలలోరిజర్వేషన్లకు అవసరం పడుతుంది. అలాగే బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా కూడా బీసీ జనాభా లెక్కలు లేక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి . 1931లో అంటే 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారి జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత 2011లో కులాల వారి లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఆ తర్వాత జనాభా లెక్కల పత్రాలు ప్రింట్ అయ్యాయి. ఈ దశలో చేయలేమని ప్రత్యేకంగా చేపడతామని ప్రకటించారు. బడ్జెట్ కూడా కేటాయించారు. నామమాత్రంగా చేశారు. కానీ వాటిని ఇంతవరకు ప్రకటించలేదు. కనీసం ఇప్పుడైనా జనాభా లెక్కలు సేకరించాలని ప్రధానమంత్రి ని కోరారు.

 జనాభా గణనలో బీసీ కులాల వారీ కాలమ్స్ ఏర్పాటు చేయాలి        ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

Related Posts