
ఢిల్లీ పరిస్థితులు హైదరాబాద్ కు రావద్దంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
- మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ నవంబర్ 04,:
బేగంపేట్ మినిష్టర్ రోడ్డులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో కలసి హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.. దీనికి ముఖ్య అతిధిగా అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.. తలసానితో కలసి మొక్కలు నాటారు.. ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా పచ్చదనంతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించె భాద్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు.. వాటిని మనం పాటించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాము అని తెలిపారు.. ఈ హరితహారం కార్యక్రమం ఎన్నికల వాతావరణాన్ని తలపించే విదంగా మంత్రులు జీప్ పైన తిరుగుతూ ప్రజలకు, హరితహారంలో పాల్గొన్న వారికి అభివాదం చేశారు..