ఆర్టీసీ కార్మికులకు అఖిలపక్ష మద్దతు
భద్రాద్రి కొత్తగూడెం
రాష్ట్రంలో గత 31 రోజులనుండి తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు , సమ్మె చేస్తున్న నేపథ్యం లో సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ,కులసంఘాలు ఎమ్మార్పీఎస్ అఖిలపక్ష సీపీఐ సీనియర్ నాయకులు కూనంనేని సాంబశివరావు, లు హాజరయ్యి కార్మికులకు సంఘీభావం తెలియచేశారు. అనంతరం ముందుగా సమ్మె చేస్తున్నా బ్రిడ్జి సెంటర్ నుండి డిపో వరకు అఖిల పక్ష నాయకులు బ్యానర్ల తో ర్యాలీ నిర్వహించి బస్సులు తిరగకుండా డిపో ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె మొదలై ఈ రోజుకు 31వరోజు అయింది. అయినా కెసిఆర్ కి కనీసం కనికరం కూడా లేకుండా వ్యవహరిస్తున్నా ధోరణి ఒక సినిమాలో విలన్ లాగా తయ్యారయ్యాడని ఎద్దేవా చేశారు. ఏ కార్మికుల ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారో అవన్నీ మర్చిపోయి ఆ ఉద్యమాలను అణచి వేస్తున్నారన్నారు. కోర్టు ఎన్నిసార్లు మందలించిన చీవాట్లుపెట్టిన కూడా ఆయన చర్మం పల్చగా లేదు, ఎవరైనా వేరే వాళ్లు ఒక్కసారి కోర్టు మందలిస్తే గతంలో నీలం రాజశేఖర్ రెడ్డి, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి వాళ్లు రాజీనామా చేసిన చరిత్ర ఉందన్నారు. కానీ మన కేసీఆర్ గారు కోర్టు నన్ను కొడతదా...తిడతదా... అని ఆవిధంగా భాష వాడేవాళ్లను ప్రజలే శిక్షిస్తారు. కోర్టు తన పని తాను చేసి, కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అంతిమ తీర్పు ఇస్తారని అన్నారు. ఈ ఉద్యమంలో మహిళలు చనిపోయిన సంఘటన బహుశా ఈ ఉద్యమం లొనే అని గుర్తు చేస్తూ... ఇదే పేదవాళ్లు పేద మహిళలు ఇళ్ళల్లో ఉండే మహిళలు ఉద్యోగం కోసం బ్రతుకుతెరువు కోసం ఉద్యోగంలో చేరితే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ద్వారా ఆ ఉద్యోగం కూడా పోయిందని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉద్యోగం కోసం మహిళలు బయటకు వస్తే అందరి ఉద్యోగాలు తీసి వేస్తున్నాను. అని 5వ తారీకు మరొకసారి గడువిస్తున్నాం అని అలా మాట్లాడటం మంచిది కాదని ఇకనైనా కోర్టు తీర్పు అంగీకరించి ఈ సమస్యకు పరిష్కారం చూపి చివర్లో ఆయన మంచి పేరు తెచ్చుకొమని ఆయన నిప్పులు చెరిగారు. లేకపోతే నువ్వు అన్న 5000 ప్రైవేట్ బస్సులు గాని ఇంకో పద్ధతిలో గానీ మేము సిద్ధంగా ఉన్నామని ఒక ప్రైవేటు బస్సు కూడా రోడ్డు ఎక్కకుండా పోరాడతామని భద్రాచలం లో ఉన్న రాముని పాద సన్నిధి నుండి కేసీఅర్ కు హెచ్చరిస్తున్నామని అన్నారు