ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు’’
విజయవాడ
రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బంగారం, డబ్బు దాచుకున్నట్లు ఇసుక దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ తప్పులు బయటకి రాకుండా జీవో తెచ్చి మీడియా నోరు నొక్కారని అన్నారు. ఇసుక లేదంటూనే బెంగళూరు, హైదరాబాద్కు ఎలా తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని మాణిక్యాలరావు ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.10వేలు ఇవ్వాలన్నారు.