నిండు ప్రాణాలను బలిటేసుకుంటున్న వివాహేతర సంబంధాలు
హైదరాబాద్ నవంబర్ 4 :
వివాహేతర సంబంధాలు ప్రస్తుతం ఇవి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా కలిసిపోయాయి. తెలిసి కొందరు ..తెలియక కొందరు వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్నారు. ఈ సంబంధాలతో కొంతమంది అయినవారి ప్రాణాలని తీయడానికి కూడా కొందరు వెనుకాడంలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువై పోయాయి. అక్రమసంబంధాలు పెట్టుకొని ..వద్దు అని తల్లిదండ్రులు హెచ్చరిస్తే వారిని కూడా చంపడానికి వెనుకాడంలేదు. 2017 లో రాష్ట్రంలో జరిగిన హత్యలని ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆ ఏడాది మొత్తంగా 1054 హత్య కేసులు నమోదుకాగా వాటిల్లో ఎక్కువశాతం వివాహేతర సంబంధాలు వివాదాల వల్లే జరిగాయి. మరో ముఖ్య విషయం కుటుంబ వివాదాలలో చనిపోయినవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఆస్తి భూ తగాదాల్లో ఒకరి పై ఒకరు కక్ష పెంచుకొని ఎదుటివారిని చంపడానికి కూడా వెనుకాడటంలేదు.అక్రమ సంబంధాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు స్కూల్స్ కాలేజీ లలో జరగడం కొంచెం విచారించదగ్గ విషయం. దేవుడితో సమానమైన విద్యని బోధించే వృత్తిలో ఉంటూ .. అమ్మాయిలకి మాయమాటలు చెప్తూ లోబరుచుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ మద్యే హయత్ నగర్ లో కీర్తి రెడ్డి ఘటన ఎంత పెద్ద సంచనలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రియుడి మాటలు విని తాగిన మైకం లో కన్నతల్లిని అతి కిరాతకంగా మెడకి చున్నీ చుట్టి చంపేసి .. తల్లి శవం పక్కనే మూడు రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.