కోర్టును బహిష్కరించి టీఎస్ న్యాయవాదుల నిరసన
హైదరాబాద్
ఢిల్లీలో న్యాయవాదులపై పోలీసుల కాల్పులను తెలంగాణ న్యాయవాదులు ఖండించారు. అన్ని కోర్టులను బహిష్కరించి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తులు బెంచ్లు దిగిపోయారు. ఈ సందర్భంగా న్యాయవాదులు.. ఢిల్లీలో న్యాయవాదులపై కాల్పులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.