ఆఫీసులోనే ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి దహనం
ప్రభుత్వం సీరియస్
హైద్రాబాద్, నవంబర్ 4,
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. తహశీల్దార్ విజయారెడ్డిని ఓ వ్యక్తి ఆఫీసులోనే సజీవదహనం చేశాడు. ఆమె కేకలు వేసుకుంటూ బయటకు రావడంతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎమ్మార్వోను కాపాడేందుకు యత్నించిన ఆమె కారు డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.మంటల్లో శరీరం మొత్తం కాలిపోవడంతో విజయారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం నిందితుడు కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. కాలిన గాయాలతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడు సుమారు అరగంట పాటు ఎమ్మార్వోతో మాట్లాడాడని, అతడు బయటకు వెళ్లిన వెంటనే విజయారెడ్డి మంటల్లో కాలుతూ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.మహిళా ఎమ్మార్వోను ఆఫీసులోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి అక్కడ తొలి ఎమ్మార్వోగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి. పాస్‌బుక్ వ్యవహారంలో సురేశ్ ఎమ్మార్వోతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకోగానే జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మార్వో ఆఫీసులకు బయలుదేరారు. జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు.మహిళా ఎమ్మార్వో విజయారెడ్డిని ఆఫీసులో సజీవ దహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన ఘటన అని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత వంగా రవీందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పట్టపగలే కార్యాలయంలోనే ఓ మహిళా తహసీల్దార్‌ను సజీవ దహనం చేశారంటే అంతకంటే పైశాచికం ఏముంటుందని తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్ అన్నారు
ప్రభుత్వం సీరియస్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మరోవైపు రెవెన్యూ, తహసీల్దార్ ఉద్యోగుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. హోంమంత్రిని, డీజీపీని కలిసి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మెజిస్ట్రేట్ హోదా ఉన్న తహసీల్దార్‌ను ఆఫీసులోనే సజీవ దహనం చేయడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మహిళా ఎమ్మార్వో విజయారెడ్డిని ఆఫీసులో సజీవ దహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు
పోలీసుల అదుపులో సురేష్
తెలంగాణలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని సురేశ్ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్ కార్యాలయానికి సురేశ్ వచ్చాడు. తహశీల్దార్‌తో మాట్లాడాలంటూ పర్మిషన్ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు. లంచ్‌కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగినట్టు తెలిసింది. తర్వాత తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్ బయటకు వచ్చాడు. విద్యుత్ షాట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయని చెబుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. కాలిన గాయాలతో పోలీస్ స్టేషన్ ముందు పడిపోయాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌కు 60 శాతం గాయాలయ్యాయి. హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్ భూవివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విజయారెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. విజయారెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఎవరీ విజయారెడ్డి?
నల్లగొండ జిల్లా నకిరేకల్ విజయారెడ్డి సొంతూరు. ఆతమె తండ్రి సి.లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గతంలో ఎమ్మారోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. భూములకు సంబంధించిన పాస్‌బుక్కుల వ్యవహారంలో గతంలో పలువురితో ఆమె వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మరోవైపు రెవెన్యూ, తహసీల్దార్ ఉద్యోగుల సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. హోంమంత్రిని, డీజీపీని కలిసి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మెజిస్ట్రేట్ హోదా ఉన్న తహసీల్దార్‌ను ఆఫీసులోనే సజీవ దహనం చేయడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మహిళా ఎమ్మార్వో విజయారెడ్డిని ఆఫీసులో సజీవ దహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన ఘటన అని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత వంగా రవీందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పట్టపగలే కార్యాలయంలోనే ఓ మహిళా తహసీల్దార్‌ను సజీవ దహనం చేశారంటే అంతకంటే పైశాచికం ఏముంటుందని తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్ అన్నారు.