YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రాజస్థాన్ లో దారుణం... మహిళపై గ్యాంగ్ రేప్

రాజస్థాన్ లో దారుణం... మహిళపై గ్యాంగ్ రేప్

రాజస్థాన్ లో దారుణం... మహిళపై గ్యాంగ్ రేప్
జైపూర్, నవంబర్ 4,
రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోచింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిని అడ్డగించిన ముగ్గురు దుండగులు ఆమెను కారులో ఎక్కించుకుని గ్యాంగ్ రేప్ చేశారు. కారులో 6గంటల పాటు ఆమెకు నరకం చూపించి రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు.రాజస్థాన్‌లోని దౌసా జిల్లా లాల్‌సోట్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి పట్టణంలో కోచింగ్ తీసుకుంటోంది. యువతి రోజూ గ్రామం నుంచి లాల్‌సోట్‌కి ఒంటరిగా వెళ్లిరావడాన్ని గమనించిన దుండగులు నవంబర్ 1వ తేదీ సాయంత్రం ఆమె మార్గమధ్యంలో ఆ కామాంధులు అడ్డగించారు. ఆమె నోరు నొక్కేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 6 గంటల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి లాల్‌సోట్-గంగాపూర్ హైవేపై పడేసి వెళ్లిపోయారు.కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు నేరుగా లాల్‌సోట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచార నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Posts