YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

వరద వల్లే ఇసుక కొరత : జగన్

వరద వల్లే ఇసుక కొరత : జగన్

వరద వల్లే ఇసుక కొరత : జగన్
విజయవాడ, నవంబర్ 4,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక కొరతపై స్పందించారు. ఇసుక కొరత తాత్కాలికమని.. 90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులతో పాటూ మరికొన్నిటికి వరద వస్తోందన్నారు. వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా మారిందని.. లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితులు ఇసుక రీచ్‌లలో ఉందన్నారు. 265పైగా ఇసుక రీచ్‌ల్లో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని.. మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలోనే ఉన్నాయని చెప్పారు.తమ ప్రభుత్వం అవినీతికి అవకాశం లేకుండా ఇసుక సరఫరా చేస్తోందని.. అందుకే అత్యంత పారదర్శకమైన పాలసీ తీసుకొచ్చామన్నారు. పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని.. ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి ప్రత్యేక స్టాక్‌ యార్డులు కూడా ఇస్తామన్నారు. నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుందన్నారు. గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందన్నారు ముఖ్యమంత్రి. ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారన్నారు.సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇసు కొరతపై ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు ఇంటిలిజెన్స్ డీజీతో సమావేశమపై తాజా పరిస్థితిపై సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఇసుక సమస్య తీరుతుందని సీఎం చెప్పారు.

Related Posts