YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఇండియా కొత్త మ్యాప్ లో కనిపించని అమరావతి

ఇండియా కొత్త మ్యాప్ లో కనిపించని అమరావతి

ఇండియా కొత్త మ్యాప్ లో కనిపించని అమరావతి
న్యూఢిల్లీ, నవంబర్ 4,
ఇండియా కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానికి చోటు దక్కలేదు. కేంద్రం తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నట్లు సూచిస్తే. ఏపీకి మాత్రం రాజధాని లేనట్లుగా చూయించారు. దీంతో రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించ లేదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇదిలా ఉంటే రాజధాని వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబును టార్గెట్ చేశారు.‘మోసం నీ సహజ గుణమని నిరూపించావ్ చంద్రబాబు..ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశావ్.. 5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంరాలు రాజధాని పేరుతో మోసం చేసి,కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి,ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్’చంద్రబాబుపై కన్నా విరుచుకుపడ్డారు.5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంరాలు రాజధాని పేరుతో మోసం చేసి,కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి,ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్.కేంద్రం జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జమ్మూ, కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. శ్రీనగర్ రాజధానిగా జమ్మూ కాశ్మీర్.. లేహ్ రాజధానిగా లడాఖ్‌‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌కి ఉన్న రాష్ట్ర హోదా రద్దవడంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య 28కి చేరింది. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 2కు పెరిగి 9కి చేరింది.జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో.. భారత్‌లోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాజధానుల్ని గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని లేనట్లుగా నోటిఫై చేశారు. ఇప్పుడు ఈ మ్యాప్ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అవుతోంది.

Related Posts