Highlights
- 11 పార్టీల కూటమికి సన్నాహాలు
- వచ్చే నెల 7న యునైటెడ్ ఫ్రంట్ తొలి సమావేశం
- ఓ జాతీయ ఛానల్ కథనం
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు జాతీయ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ కధనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7న జరుగుతుందని ఆ ఛానల్ పేర్కొంది. శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్‌పీ), స్టాలిన్ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అసోం గణపరిషత్ (ఏజీపీ)లతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఆ కథనం పేర్కొంది.