YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ పై నేతల ముప్పేట దాడి మండిపడ్డ మంత్రులు నాని, అవంతి,

పవన్ పై నేతల ముప్పేట దాడి మండిపడ్డ మంత్రులు నాని, అవంతి,

 పవన్ పై నేతల ముప్పేట దాడి
మండిపడ్డ మంత్రులు నాని, అవంతి,
విజయవాడ, నవంబర్ 4,
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్థం కాలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు... లాంగ్‌ మార్చ్‌లో వరదల్లో ఇసుక ఎలా తీస్తారో అనే టెక్నాలజీ గురించి చెప్తారేమో అని ఎదురు చూశాం. జనంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే లాంగ్‌మార్చ్‌కి అన్ని పార్టీలను జనాల్ని పంపమని ఎందుకు అడిగారు..? పవన్‌ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని కూడా సరిగా చదవలేకపోయారని విమర్శించారు. వేదికల మీద అర్థం లేకుండా ఊగిపోతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం అసహ్యించుకుంటారని అన్నారు.కన్నబాబుని నాగబాబు గెలిపించారని అంటున్నారు. మరి అదే నిజమైతే మీ అన్న నాగబాబు ఎందుకు గెలవలేకపోయారు..? మీ అన్నను నువ్వెందుకు గెలిపించలేకపోయావో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు నిన్ను నమ్మడం లేదని గుర్తించాలి. ప్రజలు మీతో ఉంటే మీరెందకు రెండు చోట్లా ఓడిపోయారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఇసుకను మింగేసి అచ్చెన్నాయుడు ఆంబోతులా బలసిపోయారు. నాగావళి నదిలో ఇసుకను బకాసురుడులా మింగేశారు. అలాంటి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకొని పవన్‌ మాకు నీతులు చెప్తారా..? అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఏరియాలో రంగురాళ్లను దోచేశారని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్‌ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారని మంత్రి నాని విమర్శించారు.అన్నను అడ్డుపెట్టుకుని ఎదిగినవాడిని కాదని.. తాను స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిని అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సినిమా వాళ్లంటే తమకు గౌరవం ఉందని.. అయితే పవన్‌ భాష మాత్రం మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. లాంగ్‌ మార్చ్‌ పేరిట విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. కాపు యువతను పక్కదోవ పట్టించేందుకే పవన్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాటి మీటింగ్ తర్వాత పవన్ అమాయకత్వం, అపరిపక్వత పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. పవన్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయ నాయకులు కాలేరని పవన్‌కు చురకలు అంటించారు.

Related Posts