కర్కోటకుడు ఈ సీఎం..!
ప్రజాస్వామ్యమా.. రాచరికమా..?
ప్రభుత్వంపై షాద్ నగర్ కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ ఆగ్రహం
షాద్ నగర్
కేసీఆర్ ఒక నియంత అని ఆర్టీసీ కార్మికులపై కరుణ చూపని కర్కోటకుడని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభమైన నిరవధిక నిరాహార దీక్షలో వీర్లపల్లి శంకర్ పాల్హోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిపాలనను అపహాస్యం చేస్తున్నారని రాష్ట్రాన్ని రాచరిక పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు జ్ఞానం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ కారణంగా 50 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కార్మికులు చనిపోతుంటే.. కనికరం లేదా..? అని ఆయన నిలదీశారు. ఎంతో కొంత పట్టు విడుపులు ఉండాలని.. కేసీఆర్కు ఇంత అహం పనికి రాదని శంకర్ అన్నారు. ఈ దీక్షల్లో ఆర్టీసీ మహిళా కార్మికులు రిషి కుమారి, లక్ష్మి, శ్రీ లక్ష్మి, మంజులవాణి, జ్యోతి, కళ్యాణి, సౌభాగ్య, విజయలక్ష్మి, ఆంజనేయులు, పండరి, నీలకంఠయ్య, బిపి రెడ్డి, కృష్ణ, దశరథ్, వెంకటేష్, పీఎం లింగం దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి నేత ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి, సిపిఐ నేతలు పానుగంటి పర్వతాలు, జంగయ్య, శీను నాయక్, సిపిఎం నాయకులు రాజు నాయక్, ఆర్టీసీ జేఏసీ నేతలు మాకం నర్సింలు, అర్జున్, తిరుపతయ్య, దొనూరు రవి, వహీద్,ఎస్ఎం అలీ, రాయికల్ నరసింహులు, మహేష్, సత్యం, శంకరయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు