YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రోడ్ల నిర్మాణాల్లో కుడా రివర్స్ టెండరింగ్

రోడ్ల నిర్మాణాల్లో కుడా రివర్స్ టెండరింగ్

రోడ్ల నిర్మాణాల్లో కుడా రివర్స్ టెండరింగ్
అమరావతి  నవంబర్ 04,:
సోమవారం జరిగిన రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమీక్ష ముగిసింది. ఈ భేటీకి న మంత్రి ధర్మాన కృష్ణదాసు , ముఖ్యకార్యదర్శి తిరుమల కృష్ణబాబు, నేషనల్ హైవేస్ అధికారులు, రోడ్లు,  భవనాల శాఖ అధికారులు హజరయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించండి. యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తికావాలి. అధికారులు చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. రూ. 625 కోట్లతో రోడ్లకు సత్వర మరమ్మతులు చేయించాలని అన్నారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తిచేయాలని ఇఅన్నారు. దుర్గగుడికి వచ్చే యాత్రికులు వల్ల పనులు నిలుపుతున్నారన్న అధికారులు, జనవరి నెలాఖరుకు పూర్తిచేస్తామని అన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ పూర్తిచేయాలి. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులువివరించారు. ఆర్ అండ్ బీలో ఉన్న ఖాళీలను గుర్తించండి. జనవరిలో భర్తీకోసం క్యాలెండర్ రిలీజ్ చేద్దాం. రోడ్ల నిర్మాణం అంచనాల విషయంలో వాస్తవికత ఉండాలి. మనం ప్రతిపనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నాం. రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండని సూచించారు. ఇక్కడ కూడా రివర్స్ టెండర్లు విజయవంతం అవుతాయి. సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిది. చేసే రోడ్ల విస్తరణ ఏదైనా రెండు లేన్ల రోడ్లుగా విస్తరిస్తేనే బాగుంటుందని అన్నారు. 
అమరావతి – అనంతపురం ఎక్స్ప్రెస్ వే పై కుడా  సమావేశంలో చర్చ జరిగింది. భూసేకరణపై ప్రధానంగా దృష్టిపెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని సీఎం అన్నారు. ముందుగా  నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తుకోసం 8 లేన్ల రోడ్డు వరకూ భూ సేకరణ చేస్తున్నామన్న అధికారులు,  ఎక్స్ప్రెస్ వే లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నాలుగులేన్లా, ఆరులేన్లా అన్నది చర్చజరుగుతుందని అన్నారు. 
మరావతి– అనంతపురం ఎక్స్ప్రెస్వేను చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం అంగీకారం ఇచ్చారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టిపెట్టాలి. న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సహాయం రోడ్లకు మహర్దశ పడుతుంది.  న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ఇస్తున్న రూ.6400 కోట్లతో సుమారు 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్ల అభివృద్ది, అవసరమైన చోట కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేయండి.  ప్రస్తుతం ఉన్న రుణసహాయం రూ.6400 కోట్లనుంచి రూ.8800 కోట్లకు పెంచేందుకు సీఎం నిర్ణయించారు.  జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత.   ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే.. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

Related Posts