ఆర్టీసీ సమ్మెకు టిడిపి మద్దతు
ఆసిఫాబాద్ నవంబర్ 04,:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం గత 31 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో సమ్మె చేస్తున్నారు. ఇవాళ ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుళ్ళపల్లి ఆనంద్ పాల్గొన్నారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని వారు పునరుద్ఘాటించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి కాబట్టే ప్రతిపక్షాలుగా మేము మద్దతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని.. అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని దివాళా తీయించి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహారదీక్ష లో తెలుగుదేశం పార్టీ పక్షాన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుళ్ళపల్లి ఆనంద్ తో పాటుగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు సాదిక్ అలీ, జిల్లాపార్టీ ప్రధాన కార్యదర్శి పి.ఆత్మారామ్, కార్యదర్శి జె.దేవేందర్, కార్యనిర్వాహక కార్యదర్శి పి.సురేష్ కుమార్, టి.ఎన్. ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.సాయిరాం, జిల్లా తెదేపా గౌడ సంగం అధ్యక్షుడు ఎస్.తిరుపతి గౌడ్, మండలపార్టీ అధ్యక్షుడు దౌలత్ కుమార్, నాయకులు గులాబ్ రావ్, అరవిందుకుమార్, సి.హెచ్ సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.